రామ్ చరణ్ కు అవమానం



టాలీవుడ్ లో క్రేజ్ హీరోగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ కు బాలీవుడ్ లో అవమానం జరిగింది . ఇంతకి ఆ వివరాలు ఏమిటంటే లేటెస్ట్ గా హాలీవుడ్ స్టైల్ లో బాలీవుడ్ లో కూడా వరెస్ట్ అవార్డ్స్ అని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఈ అవార్డులను ప్రకటించి అతి వరేస్ట్ నటీనటులను ఎంపిక చేస్తారు. ఆ కోవలో లేటెస్ట్ గా జంజీర్ చిత్రం ఈ వరేస్ట్ అవార్డులలో ముందుంది. ఈ ఏడాదికి గాను వరెస్ట్ హీరోగా రామ్ చరణ్ ఎంపిక అయ్యాడు. అలాగే వరెస్ట్ హీరోయిన్ గా ప్రియాంక, వరెస్ట్ సపోర్టింగ్ రోల్ లో సంజయ్ దత్, దర్శకుడిగా అపూర్వ లకియ ఎంపికయ్యారు. వీరితో పాటు దీపిక పదుకొనే చెన్నై ఎక్స్ ప్రెస్, అజయ్ దేవగన్ హిమ్మత్వాల సినిమాలకు ఎంపిక చేసారు. గోల్డెన్ కేల అవార్డ్స్ పేరుతో వీటిని ఏర్పాటు చేసారు.

Post a Comment

 
Top