ప్రభాస్ కి మేటర్ సీరియస్ అయింది అనే టైటిల్ ను చూసి కంగారు పడాల్సిందేమి లేదు. కాకపోతే ప్రభాస్ భవిష్యత్ లో చాలా జాగ్రత్తలు పడాలి. ముఖ్యంగా కథల విషయంలో, అలాగే ఆ కథలోని యాక్షన్ స్టంట్స్ విషయంలో. ఎందుకంటే రీసెంట్ గానే ప్రభాస్ కి షోల్డర్ సర్జరీ జరిగింది. దీనికి సంబంధిచిన న్యూస్ ను ప్రభాస్ స్వయంగా వివరించాడు. ‘నేను ఒక నెల క్రితం షోల్డర్ సర్జరీ చేసుకున్నాను. చాలా రోజుల క్రితమే చేసుకోవాల్సిన ఈ సర్జరీని చాలా ఆలస్యం చేసి ఇప్పుడు చేసుకున్నాను. 

సర్జరీ సక్సెస్ గా జరిగింది. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను. మరో నెల రోజుల్లో షూటింగ్ లో పాల్గొంటానని’ అంటూ ప్రభాస్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. ఈ సర్జరీ అనంతరం ప్రభాస్ ఓ కఠినమైన నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఇక నుండి తను నటిస్తున్న అప్ కమింగ్ మూవీలలో ఎటువంటి హింసాత్మక మైన యాక్షన్ స్టంట్స్ ఉండకూడదని,అలాగే విపరీతమైన జిమ్ యాక్టివిటీస్ వంటి పాత్రలను ఎంచుకోకుడని ప్రభాస్ అనుకుంటున్నాడు. బాహుబలి మూవీ కారణంగా ప్రభాస్ విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తున్నాడు. 

దీని కారణంగా ప్రభాస్ కి తెలియకుండానే ఫిజికల్ గా బాగా అలసిపోతున్నాడు. దీని కారణంతో తను అప్ కమింగ్ మూవీలలో మరెటువంటి యాక్షన్ పాత్రలను చేయలేనంతగా తయారయ్యాడు. దాదాపు బాహుబలి మూవీ అనేది ప్రభాస్ ఫిల్మ్ కెరీర్ లోనే ఓ గొప్ప యాక్షన్ చిత్రంగా ఉండబోతుంది. తాజాగా జరిగిన షోల్డర్ సర్జరీ కారణంగా తను ఫిజికల్ గా ఎటువంటి ఎక్స్ పరిమెంట్స్ చేయటానికి వీలు లేదని డాక్టర్స్ బలంగా చెప్పారంట. 

అందుకే ప్రభాస్ భవిష్యత్ లో బాహుబలి తరహా మూవీలలో నటించడం కష్టతరమే అని అంటున్నారు. మొత్తానికి జరిగింది షోల్డర్ సర్జరీ అయినా ప్రభాస్ బాడీ ప్రయోగాత్నకత మూవీలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అని అంటున్నారు.

Post a Comment

 
Top