హాలీవుడ్ రేంజ్ లో 'రేయ్' చిత్రానికి 2 కోట్ల ఖరీదైన కాస్ట్యూమ్స్
బొమ్మరిల్లు వారి పతాకం పై వై వి యస్ చౌదరి స్వీయ దర్శకత్వం లో సాయి ధరం తేజ్ హీరో గా నిర్మించిన 'రేయ్' చిత్రం మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నా విషయం తెలిసిందే. భారత చలన చిత్ర చరిత్రలో 'ధూమ్' చిత్రాల సిరీస్ లో వెస్ట్రన్ స్టైల్ కాస్ట్యూమ్స్ డిజైనింగ్ లో ఎంత పాపులారటి వచ్చిందో అందరికి తెలిసిందే. ఐతే ఇప్పుడు తెలుగు సినిమా చరిత్ర లో 'రేయ్' చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ లో అంతే పాపులారటి దక్కుతుంది. 'రేయ్' చిత్రానికి దర్శక నిర్మాత వై వి యస్ చౌదరి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ కోసం చేసిన రిసెర్చ్, పడ్డ శ్రమ, ప్రయత్నం ఆయన మాటల్లో.....
"తెలుగు సినిమా చరిత్ర లో ఇప్పటివరకు రాని సరికొత్త బ్యాక్ డ్రాప్ లో అమెరికా లో జరిగే బెస్ట్ అఫ్ ది వరల్డ్ అనే టైటిల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా టాప్ పాప్ స్టార్స్ మధ్య జరిగే కాంపిటిషన్ ని కథ గా రాసుకోవడం జరిగింది. ఫస్ట్ హాఫ్ లో వెస్టిండిస్ బ్యాక్ డ్రాప్, సెకండ్ హాఫ్ అంతా అమెరికా బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది.' రేయ్' సినిమా ని అక్కడి మనుషుల ఆహర్యన్ని , వెండితెర మీద కు తీసుకురావడాని భారి బడ్జెట్ అవసరమైంది. ' రేయ్' సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నపుడు కరేబియన్ మూవీ చూస్తున్నామా అనే ఫీల్ కలిగేల వుండాలి . ఇక ' రేయ్' సినిమా సెకండ్ హాఫ్ లో హాలీవుడ్ మూవీ చూస్తున్నామా అనే ఫీల్ కలగాలి. పాప్ లుక్ తీసుకురావడానికి మేము చాల దేశాలు తిరిగి కాస్ట్యూమ్స్ సెలక్షన్స్ చేయడం జరిగింది. ఆ తరువాత ఆ కాస్ట్యూమ్స్ ని డిజైనింగ్ చేయడం కోసం చెన్నై నుండి సాయి,శివ హైదరాబాద్ నుంచి జానకి రామ్ వేగి రాజు , షోలాపూరి అశోక్ లను సంప్రదించి,నా దగ్గర వున్నా కలెక్షన్స్ తో ఫైనల్ డిజైన్స్ ని తయారు చేయడం జరిగింది. అంతేకాకుండా , లాస్ వేగాస్ ,న్యూ యార్క్ , లాస్ ఏంజిల్స్, షాన్ ఫ్రాన్సిస్కో, వెస్టిండిస్ లోని పోర్ట్ ఆప్ స్పెయిన్, బ్యాంకాక్, మలేషియా, లాంటి విదేశాల్లో నే కాకుండా ఇక్కడ తమిళనాడు లోని తిరుపూర్ కి కూడా మా కాస్ట్యూమ్స్ టీం ని పంపి స్పెషల్ గా సెలెక్ట్ చేసి కొనడం జరిగింది. దీని నిమిత్తం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రేపు సినిమా చూసిన తరువాత మేము కొన్న కాస్ట్యూమ్స్ చిత్రం లో మేము అనుకున్నలుక్ రావడానికి ఎంత దోహద పడ్డాయో మీకే తెలుస్తుంది . రేయ్ సినిమా చూసిన నా శ్రేయోభిలాషులు సన్నిహితులు 'ఒక హాలీవుడ్ మూవీ ' లుక్ వుందని అని అంటుంటే మా శ్రమకు తగిన ప్రతిపలం దక్కిందన్న సంతోషాన్ని కలిగింది." అని అన్నారు.
Post a Comment