ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ (78) నిన్న రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడం తో ముంబాయ్ లోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరిపించారు. 

సినిమా ఇండస్ట్రీలో భరత్ కుమార్ గా పిలవబడే మనోజ్ కుమార్ బాలీవుడ్ లో దాదాపు 55 సినిమాల్లో హీరోగా నటించి , 7 సినిమాలకు దర్శకత్వం వహించారు. 

ఆయన హీరో గా నటిస్తూ , దర్శకత్వం వహించిన 'ఉప్కర్ ' చిత్రానికి జాతీయ అవార్డు కుడా వచ్చింది. ఒక నటుడిగా ,దర్శకుడిగా సినీ పరిశ్రమకి ఏనలేని సేవలందించినందుకు భారత ప్రభుత్వం 1992 లో ఆయనకు పద్మశ్రీ అవార్డు ను ఇచ్చి గౌరవించింది.

Post a Comment

 
Top