Latest

09:06 AM Robo 2.0 Trailer

బాలీవుడ్ లో ఉన్నంత హాట్ హాట్ టాలీవుడ్, కోలీవుడ్ లో లేదంటే నమ్మక తప్పదు. ఎందుకంటే తెలుగు, తమిళ సినిమాలలో సెన్సార్ వాళ్ళు హాట్ ఎక్కువైతే జనాలకు చెమటలు వస్తాయని.. ఐటెం భామల అందాలను సెన్సార్ ద్వారా కట్ చేస్తుంటారు. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయం తెలిసి కూడా ఓ నిర్మాత అనవసరంగా డబ్బులు వృధా చేయడానికి సిద్ధం అయ్యాడు.

ఇంతకీ అసలు విషయమేమిటంటే... తమిళంలో "వడకర్రీ" అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో హాట్ హాట్ గా ఓ ఐటెం సాంగ్ లో నటించడానికి బాలీవుడ్ అందాల సుందరి సన్నీలియోన్ కు అక్షరాల కోటి రూపాయలు పారితోషకం చెల్లిస్తున్నారని తెలిసింది. ఈ పాట ద్వారా తమ సినిమాకు మరింత హిట్ అవడంతో, ఎక్కువ పబ్లిసిటీ కూడా అవుతుంది అనే ఉద్దేశ్యంలో ఉన్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ పాటలో సన్నీతో ఒక రేంజులో అందాల ప్రదర్శన చేయించనున్నారని తెలిసింది. కానీ ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా "సన్నీ ఇంతకు ముందే తన అందాలను మొత్తం చూపించేసింది. ఈ పాటపైన, మీ హాట్ ఆశలపై సెన్సార్ బోర్డు నీళ్ళు చల్లటం ఖాయం" అంటూ నవ్వుకుంటున్నారు. మరి సన్నీ అందాలు ఎంతవరకు ఈ సినిమాకు ఉపయోగపడుతుందో చూడాలి.

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top