దాదాపు వరుసగా ఐదు ఫ్లాపుల తర్వాత రవితేజ చేసిన సినిమా బలుపు. ఈ సినిమాతో హిట్ ఆదుకున్నాడు రవితేజ. దాంతో ఇకపై తన ఫిల్మ్ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు రవితేజ. అతని ఫిల్మ్ కెరీర్ ప్లానింగ్ చూసి టాలీవుడ్ పెద్దలు సైతం ఆశ్చర్యపోతున్నారు. రవితేజ పని అయిపొయింది అనుకున్న వాళ్ళు ఇప్పుడు రవితేజ మళ్లీ ఫాం లోకి వచ్చాడు అని అంటున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పరిశ్రమలో రవితేజ స్టైల్ సపరేటు అంటున్నారు. ప్రస్తుతం రవితేజ కేవలం ఒకే ఒక్క సినిమాలో నటిస్తున్నాడు. బాబీ దర్శకత్వం లో రూపొందుతున్న పవర్ సినిమాతో రవితేజ బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు తన చేతిలో నలుగు సినిమాల వరకు ప్రీ షెడ్యుల్స్ జరిగి ఉంటుంది. ఇప్పుడు తన ముందుకు ఎంతమంది ఎన్ని స్టొరీలు తీసుకొచ్చిన ఈ సినిమా తర్వాత చూద్దాం అని అంటూ పక్కకు పెడుతున్నాడట. రవితేజలోని ఈ మార్పును చుసిన రచయితలూ కొత్త దర్శకులు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2009 లో తన బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కిక్ సినిమాకి సీక్వెల్ ను త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. కిక్ సీక్వెల్ జూన్ నెల నుంచి సెట్స్ పైకి వెలుతుందని ప్రీ-ప్రొడక్షన్ నుంచి అందిన సమాచారం. ప్రస్తుతం సురేందర్ రెడ్డి రేసు గుర్రాన్ని తెరకేక్కిస్తున్నాడు.

Post a Comment

 
Top