Latest

09:06 AM Robo 2.0 Trailer


వరస సినిమాలతో బిజిగా ఉన్న ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. ఆయన నటించిన బాద్షా చిత్రం సౌత్ నుంచి Osaka ఫిల్మ్ ఫెస్టివల్ 2014 కి అఫీషియల్ గా ఎంపిక చేయబడ్డ ఏకైక చిత్రం. దాంతో ఎన్టీఆర్ అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. ఈ ఫెస్టివల్ కి ఎంపిక కాబట్ట మరో ఇండియన్ చిత్రం భాగ్ మిల్కా భాగ్. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఇండియాలోనే కాదు…జపాన్ లాంటి దేశాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే ఆయన సినిమాలు ఇక్కడి బాషలతో పాటు ఆయా దేశాల్లో వాడుకలో ఉన్న బాషల్లోకి కూడా అనువాదం అవుతూ ఉంటాయి. ఇపుడు రజనీకాంత్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడ క్రమక్రమంగా పాపులారిటీ సంపాదిస్తున్నారు. ఎన్టీఆర్    ఫిజీ అనే ఓ టీవీ ఛానల్‌ అప్పట్లో ఎన్టీఆర్‌పై ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించింది. దాని కోసం ఇండియా వచ్చి ఎన్టీఆర్‌ ఇంటర్వ్యూ తీసుకొన్నారు కూడా. ఆ సందర్భంగా ఎన్టీఆర్‌ జపనీస్‌ నేర్చుకొని.. ఆ భాషలో కాసేపు మాట్లాడారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమాలు కూడా జపనీస్‌లో అనువాదాలుగా వెళ్లనున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా’ చిత్రం ఇపుడు జపాన్ బాషలోకి అనువాదం అవుతోంది. ఈ మేరకు బాద్‌షా మూవీ మేకర్స్ జపాన్‌కు సంబంధించిన సంస్థతో అగ్రిమెంటు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జూ ఎన్టీఆర్ డాన్స్‌ను జపనీయులు తెగ ఇష్టపడుతున్నారట. అక్కడి టీవీ కార్యక్రమాల్లో డాన్స్ షోలలో జూ ఎన్టీఆర్ సాంగులను రీమిక్స్ చేసి మరీ వాడుతున్నారట. కేవలం ఎన్టీఆర్ నటించిన ‘బాద్ షా’ చిత్రం మాత్రమే కాదు, ఆయన నటించిన ఇతర చిత్రాలను కూడా కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉన్నాయట జపాన్‌కు చెందిన పలు సినిమా సంస్థలు.

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top