Bhale Manchi Roju Movie Review, Rating Bhale Manchi Roju Movie Review, Rating Bhale Manchi Roju Movie Review, Rating Bhale Manchi Roju Movie Review, Rating Bhale Manchi Roju Movie Review, Rating 

చిత్రం: భలే మంచిరోజు
తారాగణం: సుధీర్‌బాబు.. వామిఖ.. ధన్య బాలకృష్ణన్‌.. చైతన్యకృష్ణ..సాయికుమార్‌.. వేణు.. పోసాని తదితరులు
దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య
సంగీతం: ఎం.ఆర్‌ సన్నీ
ఛాయాగ్రహణం: శ్యాందత్‌
ఎడిటర్: వర్మ ఎం.ఆర్‌
నిర్మాతలు: విజయ్‌.. శశి
విడుదల: 25-12-2015




క్రైమ్కామెడీ చిత్రాల్లో ఉండే సౌలభ్యం ఏమిటంటే.. చిన్న కథ ఉంటే చాలు. భారీ బడ్జెట్తో పనిలేదు. స్టార్తారాగణం అవసరం ఉండదు. అనుకున్న కథను ఎంత ఆసక్తికరంగా చెప్పావ్‌? పరిమిత వనరుల్ని ఎలా వాడుకొన్నావ్‌? రెండు గంటల పాటు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టారా? లేదా? అన్నవేవిజయాన్ని నిర్ణయిస్తాయి. మధ్యన చిన్నచిత్రాలు ఎక్కువే వస్తున్నాయి. విభిన్నంగా ప్రయత్నిస్తూ.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తరహాలో నిర్మించినట్లుచెబుతున్న...భలే మంచిరోజుఎంత మేర ఆకట్టుకుందో చూస్తే..
కథేంటంటే: రామ్‌(సుధీర్‌బాబు)ఓ మెకానిక్‌. తనని ప్రేమ పేరుతో మోసం చేసి.. మరో అబ్బాయిని పెళ్లి చేసుకొంటున్న మాయ(ధన్య బాలకృష్ణన్‌)కిబుద్ధి చెప్పాలనుకుంటాడు. ఇందుకోసం తన స్నేహితుడు (ప్రవీణ్‌)తో కలిసి కారులో బయల్దేరతాడు. అదే సమయంలో శక్తి(సాయికుమార్‌)..సీత(వామిఖ)ను కిడ్నాప్‌ చేసి తీసుకొస్తుంటాడు. అనుకోకుండా రామ్‌ తన కారుతో.. శక్తి కారుని ఢీకొంటాడు. ఆ శక్తి బారి నుంచి సీత తప్పించుకుని పారిపోతుంది. సీత తప్పించుకోవడానికి నువ్వే కారణం..అందుకే సీతను నువ్వే తీసుకురా లేదంటే నీ స్నేహితుడ్ని చంపేస్తా’ అని బెదిరిస్తాడు శక్తి. దీంతో చేసేది లేక సీతని తీసుకొచ్చే బాధ్యత నెత్తి మీద వేసుకొంటాడు రామ్‌.
ఇద్దరు కిడ్నాపర్ల(వేణు,ఆల్బర్ట్‌)తో కలసి సీతని కిడ్నాప్‌ చేయగలుగుతాడు రామ్‌. ఆమెను తీసుకొచ్చే మార్గ0మధ్యలో తనను మోసగించిన మాయ పెళ్లి ఒక చర్చిలో జరుగుతుందని తెలిసి అక్కడికి వెళతాడు రామ్‌. అదే సమయంలో మాయను పెళ్లి చేసుకోబోతున్న సూరజ్‌(చైతన్యకృష్ణ)ను షూట్‌ చేసి అందరికీ షాకిస్తుంది సీత. ఇంతకీ సూరజ్‌ను సీత ఎందుకు షూట్‌ చేస్తుంది? అసలు సీత ఎవరు? సీతను కిడ్నాప్‌ చేసిన శక్తి ఎవరు? రామ్‌ తన స్నేహితుడిని శక్తి బారి నుంచి తప్పిస్తాడా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమాను వెండితెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే: సినిమా ఏదైనా..కథతో పాటు కథనం చాలా కీలకం. కథ సింపుల్‌గా ఉన్నా.. కథనంతో దాన్ని మరింత ఆసక్తిగా మార్చొచ్చు. వూహకు అందని మలుపులతో మరింత ఉత్కంఠకు గురి చేయవచ్చు. తర్వాత ఏం జరుగుతుందన్న భావనను పెంచవచ్చు. ఇలాంటి ప్రయత్నమే 'భలే మంచిరోజు’లో కనిపిస్తుంది. ఆసక్తిని పెంచేలా కథనాన్ని రూపొందించడంలో దర్శకుడి ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ అందర్నీ కట్టిపడేస్తుంది. అనవసర సన్నివేశాలుపెద్దగా లేకపోవడం చూసినప్పుడు స్కిప్టు విషయంలో దర్శకుడి జాగ్రత్త ఎంతో అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్  జోరుగా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ మాత్రం తడబడ్డాడు. దీంతో.. అప్పటివరకు మాంచి స్పీడ్‌ మీద వెళ్లే బండి నెమ్మదించింది. మిగిలిన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చినంత కూడా హీరోయిన్‌ పాత్రకు ఇవ్వకపోవడం కనిపిస్తుంది. సినిమాలో పాటలు ప్లస్‌ కావాలి కానీ.. ఇబ్బంది కాకూడదు. నిజానికి భలే మంచిరోజు లాంటి సినిమాల్లో పాటల ప్రాధాన్యం నామమాత్రమే. ఆ విషయాన్ని దర్శకుడు మిస్‌ అయినట్లు కనిపిస్తుంది. కండబలంతో గెలిచే కథానాయకుడు.. బుద్ధిబలాన్నీ చూపించి ఉంటే మరింత రక్తి కడుతుంది. కామెడీ తగ్గిందన్న లోటును చివరిలో పృథ్వీ పాత్ర కొంత భర్తీ చేస్తుంది.
ఎవరెలా చేశారంటే: వైవిధ్య కథల ఎంపికలో సుధీర్‌బాబు జాగ్రత్త ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. అయితే సుధీర్‌బాబు నటన అంతగా మెప్పించలేదనే చెప్పొచ్చు. హీరోయిన్‌ వామిఖది ప్రాధాన్యం లేని పాత్రే. దానికి తగ్గట్టు ఆమె ప్రదర్శన అంతంతే. సాయికుమార్‌ లాంటి నటుడ్ని ఎంతలా వాడుకోవచ్చో శక్తి పాత్ర చూస్తే అర్థమవుతుంది. ఖమల్లెపుష్పం రామారావు’ పాత్రలో పృథ్వీ వినోదం ఆకట్టుకొంటుంది. పోసాని, పరచూరి గోపాలకృష్ణలు తమ పరిధి మేర చేశారు.
సాంకేతికంగా: సన్నీ అందించిన పాటలు ఓకే. నేపథ్య సంగీతం ఆకట్టుకొంటుంది. కెమేరా పనితనం బాగుంది. దర్శకుడిగా శ్రీరామ్‌ ఆదిత్యకు ఇదే తొలిచిత్రం అయినప్పటికీ తన ముద్రను సినిమా ద్వారా వేయగలిగినట్లే. ఫస్ట్ హాఫ్ చూపిన జోరు సెకండ్ హాఫ్ చూపించి ఉంటే... భలే మంచి సినిమా’గా మిగిలేది.

ప్లస్ పాయింట్లు:
+ ప్రథమార్థంలో మలుపులు 
+ పృథ్వీ నటన 
+ నేపథ్య సంగీతం 
+ కెమేరామెన్ పనితనం 

మైనస్ పాయింట్లు:

- సెకండ్ హాఫ్ 

కొసమెరుపు: సగం’’మంచిరోజు 

Post a Comment

 
Top