Soukyam Movie Review, Rating Soukyam Movie Review, Rating Soukyam Movie Review, Rating Soukyam Movie Review, Rating Soukyam Movie Review, Rating
చిత్రం: సౌఖ్యం

నటీనటులు: గోపీచంద్‌.. రెజీనా.. ముఖేష్‌రుషి.. బ్రహ్మానందం.. పృథ్వీ.. పోసాని.. షావుకారు జానకి తదితరులు.

కథ.. మాటలు: శ్రీధర్‌ సీపాన

స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌.. గోపీమోహన్‌

నిర్మాత: ఆనంద్‌ ప్రసాద్‌

దర్శకత్వం: రవికుమార్‌ చౌదరి

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌

విడుదల తేదీ: 24-12-15

వరస ఫ్లాపులతో సతమతవుతున్న హీరో గోపిచంద్‌కి గత చిత్రం ‘లౌక్యం’ వూపిరి పోసింది. యాక్షన్‌ సినిమాలు చేసే గోపిచంద్‌ లౌక్యంతో మంచి వినోదాన్ని పంచాడు. ఈ జోనర్‌లో గోపిచంద్‌ హిట్‌ కొట్టడంతో మరోసారి వినోదాత్మక చిత్రాన్నే ఎంచుకున్నాడు. తనకున్న చిత్ర పేరులో సున్న ఉండాలన్న సెంట్‌మెంట్‌ను ఫాలో అవుతూ.. తాజాగా ‘సౌఖ్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి లౌక్యం ఇచ్చిన విజయాన్ని సౌఖ్యం కొనసాగిస్తుందా లేదా.. చూద్దాం...!

కథ : శ్రీను (గోపీచంద్‌) యువతని ప్రతిబింబించే సాధారణ యువకుడు.కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. ఓ సారి రైలులో ప్రయాణిస్తుంటే శైలు(రెజీనా)ని చూసి ఇష్టపడతాడు. ఆ తర్వాత ఆమెను ఫాలో అవ్వడం.. లవ్‌ చేయడం మొదలు పెడతాడు. మొత్తానికి ఆమె ప్రేమను పొందుతాడు. అయితే.. శైలు తండ్రి పీఆర్‌ (దేవన్‌) కోల్‌కతాలో పెద్ద డాన్‌. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుతో శైలు పెళ్లి నిశ్చయిస్తాడు. ఆ పెళ్లి ఇష్టం లేని శైలు హైదరాబాద్‌ వచ్చేస్తుంది. మరోవైపు.. ఆమె కోసం బావూజీ (ప్రదీప్‌రావత్‌) ముఠా వెతుకుతుంటుంది. దీంతో ఇలాంటి మాఫియా సంబంధం మనకొద్దని శ్రీను కుటుంబం ఆమెను వ్యతిరేకిస్తారు. మరి.. శ్రీను ఆమె వెనక పడుతున్న మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడు? ఆమె సమస్యలను ఎలా తీర్చాడు? పెళ్లికి కుటుంబసభ్యులను ఎలా ఒప్పించాడు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : ‘ఇది కొత్త కథ కాదు’ అని ‘సౌఖ్యం’ విడుదలకు ముందే దర్శక నిర్మాతలు చెప్పేశారు. కాబట్టి.. కథలో వైవిధ్యం ఆశించటం సరికాదు. కథలో కొత్తదనం లేదని తెలిసినప్పుడు పాత్రల ద్వారా.. సన్నివేశాల ద్వారా ప్రేక్షకుడ్ని కూర్చోబెట్టాల్సి ఉంటుంది. తన గత చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చిత్రాన్ని రోటీన్‌ కథతో ఉన్నా.. సరికొత్తగా చెప్పే టెక్నిక్‌తో విజయాన్ని సొంతం చేసుకున్న రవికుమార్‌ చౌదరి.. సౌఖ్యం విషయంలో తడబడ్డాడనె చెప్పొచ్చు.  

రొటీన్‌ కథే అయినప్పటికీ.. సన్నివేశాల్ని సైతం కొత్తగా చూపించే విషయంలో దర్శకుడు మరికాస్త కసరత్తు చేయాల్సింది. రైల్లో లవ్‌ ఎపిసోడ్‌ నవ్వులు పంచినా.. అది సుదీర్ఘంగా సాగటం కాస్త ఇబ్బందికి గురి చేస్తుంది. అలవాటైన కథే కావటంతో తర్వాతేం జరుగుతుందో ప్రేక్షకుడికి తెలిసిపోతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. సెకండ్ హాఫ్ హీరో.. విలన్‌ మధ్య సాగే ఎపిసోడ్‌ విషయంలో తప్పటడుగు వేశాడు. చివర్లో బ్రహ్మానందం అంత్యాక్షరి అంతగా ఆకట్టుకోదు. ఈ రోజుల్లో కథ కంటే దాన్ని నడిపే తీరు.. అందించే వినోదమే కీలకం. ఈ రెండు విషయాల్లోనూ దర్శకుడు మరికాస్త దృష్టి పెట్టాల్సి ఉంది.

గోపీచంద్‌ది యాక్షన్‌ ఇమేజ్‌. ఆయన నుంచి ఫైట్లు.. పదునైన సంభాషణలు ఆశిస్తారు. కానీ.. అందుకు భిన్నంగా చిత్రం సాగుతుంది. హీరోగా వినోదాన్ని పండించటం ఎంత కష్టమన్నది గోపీచంద్‌ను ఈ చిత్రంలో చూస్తే అర్థమవుతుంది. కథానాయికగా రెజీనా ఉన్నప్పటికీ.. పాత్ర పరిమితమే. తెరపై చాలామంది చాలామంది నటీనటులు కనిపిస్తున్నా వాళ్ల నుంచి ఆశించటానికి ఏమీ ఉండదు.

సాంకేతికంగా: అనూప్‌ పాటలన్నీ అక్కడక్కడ ఒకేలా అనిపించేలా సాగాయి. లాలీపాప్‌ అనే ప్రత్యేక గీతం ఎందుకొచ్చిందో ఎవరికీ అర్థం కాదు. శ్రీధర్‌ సీపాన రాసిన కథ.. మాటలూ వైవిధ్యానికి చాలా దూరంలో ఉన్నాయి. కోన.. గోపీమోహన్‌ స్క్రీన్‌ప్లే పండలేదు.

ప్లస్ పాయింట్లు 

+ కొన్ని వినోద సన్నివేశాలు

+ గోపీచంద్‌ పోరాటాలు

మైనస్ పాయింట్లు 

- కథ.. కథనం

- బలహీనమైన పాత్రలు

కొసమెరుపు.. ‘సౌఖ్యం’ కలిగించలేదు.

Post a Comment

 
Top