Jatha Kalise Movie Review, RatingJatha Kalise Movie Review, RatingJatha Kalise Movie Review, RatingJatha Kalise Movie Review, RatingJatha Kalise Movie Review, RatingJatha Kalise Movie Review, RatingJatha Kalise Movie Review, Rating
తారాగణం: అశ్విన్‌.. తేజస్వి.. స్నిగ్ధ.. సూర్య.. షకలక శంకర్‌.. సప్తగిరి తదితరులు 
దర్శకత్వం: రాకేష్‌ శశి 
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్‌ 
సంగీతం: సాయికార్తీక్‌.. ఎమ్‌.సి.విక్కీ 
కెమరామెన్: జగదీష్‌ చీకటి  
నిర్మాణం: నరేష్‌ రావూరి  
సమర్పణ: వారాహి చలన చిత్రం.. ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 
విడుదల: 25-12-2015

ఈ మద్య చిన్న చిత్రాలు తళుక్కున మెరుస్తున్నాయి. అదే తరహాలో వచ్చిన రోడ్‌ మూవీ పేరుతో జత కలిసే’ చిత్రం ఏ తరహా చిత్రం? టీజర్‌తో ఆసక్తి రేపిన ఈ చిత్రం ఎలా ఉందో చుద్దాం..

కథ: రిషి(అశ్విన్‌) ఓ ఎన్నారై. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడుపుతుంటాడు. స్నేహితుడి పెళ్లి కోసం విశాఖపట్నం వస్తాడు. పెళ్లి కొడుకుతో సహా మొత్తం ఐదుగురు స్నేహితులు కలిసి పెళ్లిరోజు రాత్రి పార్టీ చేసుకుంటారు. పెళ్లి కొడుకుతో పందెం కట్టి మరీ ఫుల్‌బాటిల్‌ తాగించేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి అక్కడే నానా గొడవ చేస్తారు. దీంతో పెళ్లి రద్దవుతుంది.

ఇదంతా చూసిన పెళ్లికూతురు స్నేహితురాలు పింకీ అలియాస్‌ తేజస్వి (తేజస్వి) ఆ ఐదుగురికీ బుద్ధి చెప్పాలనుకుంటుంది. అందు కోసం పింకీ ఏం చేసింది? ఆమె జీవిత లక్ష్యమేమిటి? రిషితో కలిసి ఆమె విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కి కారులో జర్నీ చేయాల్సిన అవసరం ఎందుకు? ఆ ప్రయాణంలో ఒకరినొకరు ఎలా అర్థం చేసుకొన్నారు? పింకీ లక్ష్యం నెరవేరిందా? అన్న విషయాల్ని వెండితెర మీదే చూడాలి.


ఎలా వుందంటే: థ్రిల్‌ కలిగించేలా సన్నివేశాలు తీసే అవకాశమున్నా దర్శకుడు వాటిపైన దృష్టి పెట్టలేకపోయాడు. దీంతో సినిమా సాగినట్లుగా అనిపిస్తుంది.


కథనం మీద కసరత్తు చేసి.. అనుకున్న కథకు చక్కటి కథనం రాసుకుంటే మరోలా ఉండేది. అందుకు భిన్నంగా మధ్యలో షకలక శంకర్‌.. సప్తగిరి స్ఫూఫ్‌తో నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఇక్కడా తడబాటు తప్పకపోవటంతో నిరుత్సాహానికి గురికాక తప్పదు. హీరో.. హీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ మీదా పెద్దగా కసరత్తు చేయకపోవడంతో సో.. సో.. గ అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే?: రిషి.. తేజస్వి.. కారు డ్రైవర్‌ బంగారి (స్నిగ్ధ) పాత్రల చుట్టూనే కథ సాగుతుంది. దాదాపు ప్రతీ సన్నివేశంలోనూ ఈ ముగ్గురే మేయిన్ రోల్.

 వీరిలో స్నిగ్ధ కాస్త ఆకట్టుకుంటుంది. సినిమాలో షకలక శంకర్‌.. సప్తగిరి.. రామ్‌ప్రసాద్‌.. ధన్‌రాజ్‌.. పృథ్వీ ఇలా బోలెడుమంది హాస్యనటులు కనిపిస్తారు. కానీ వాళ్ల ప్రభావం అంతంత మాత్రంగానే వుంది. కథ మీద దర్శకుడు మరికాస్త దృష్టి పెడితే బాగుండేదేమోనని ప్రేక్షకుడికి భావన కలుగుతుంది. కథ విషయంలో తప్పటడుగు వేసిన దర్శకుడు అక్కడక్కడ రాసుకున్న మాటలు ఆకట్టుకుంటాయి. సాయికార్తీక్‌.. ఎం.సి.విక్కీ సంగీతం పర్వాలేదు. జగదీష్‌ కెమెరా పనితనం బాగుంది.


ప్లస్ పాయింట్లు 

+ కథానేపథ్యం
మైనస్ పాయింట్లు 

- కథ 

- వినోదం 
- సన్నివేశాల సాగదీత
కొసమెరుపు.. జత కలిస్తే ఇంకా బాగుండేది.   

Post a Comment

 
Top