సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకేక్కుతున్న తాజా చిత్రం ' బ్రహ్మోత్సవం ', వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో అచ్చ తెలుగుంటి చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఊటీ లో జరుగుతోంది.అయితే తాజా సమాచారం ప్రకారం బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ ని న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అందుకు సంబందించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం పై త్వరలోనే అధికారికంగా వెల్లడి కానుంది.ఈ చిత్రం లో మహేష్ సరసన కాజల్ ,సమంత, ప్రణీత ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. 

Post a Comment

 
Top