ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికే ఎన్టీఆర్ ట్విట్టర్ ని హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం ''నాన్నకు ప్రేమతో '' , ఆ చిత్రం ను సంక్రాంతి కానుకగా జనవరి 13 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు అయితే ఆ తెల్లవారే బాలకృష్ణ నటించిన ''డిక్టేటర్ '' చిత్రం రిలీజ్ అవుతుండటంతో గతకొంత కాలంగా బాలయ్య - ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటోంది . బాలయ్య కు పోటీగా ఈ బుడ్డోడు రావడం ఏంటి ? ఎన్టీఆర్ పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . ఆ క్రమంలో ఎన్టీఆర్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది . పైగా నాన్నకు ప్రేమతో చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలియదు అంటూ ట్వీట్ చేయడంతో మరింత గందరగోళంగా మారింది అయితే ఇది కావాలనే ఎవరో చేసిన పని అని అర్ధం అవుతోంది 

Post a Comment

 
Top